మంగళగిరి: నెల్లూరు జిల్లా కావలిలో సెప్టెంబర్ 8,9,10 తేదీలలో షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పురుషుల, మహిళల జిల్లా జట్టును ఎంపిక చేసినట్లుగా షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్ బాబు, కార్యదర్శి కె.నరేష్, పిటి రవి తెలిపారు. స్థానిక విటిజెఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 120 మంది పాల్గొనగా ఇందులో పురుషుల జట్టుకు 12 మందిని, మహిళా జట్టుకు 12 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. పురుషుల జట్టులో కె.తేజ, ఎస్కే సమీర్, ఎం.గోపాల్, బి.నాగేశ్వరావు, కె.భాను, ఎం.శివ సాయి, బి జగదీష్, ఎం.వెంకట సాయి, క.దుర్గా రావు, పి సతీష్, టి.తేజ, జె.నారాయణ ఉన్నారు. మహిళా జట్టులో వి .తనుశ్రీ, బి.గుణప్రియ, చంద్రిక, దివ్య, పి.శారద, సిహెచ్ కృష్ణకుమారి, పి.నీలిమ దేవి, ఈ.బ్లేస్, కె.శ్రావణి, టి.త్రివేణి, ఈ.వెంకటలక్ష్మి, బి.జ్యోతి ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన జట్లను కళాశాల కరస్పాండెంట్ వి.తాతా రావు, ప్రిన్సిపల్ జి .నాగేశ్వరావు, పిడిలు కె.పౌల్ రాజ్, బి.ప్రవీణ్ లు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలని కోరారు.










