Aug 24,2023 20:27

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-నెల్లూరు : సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి కలెక్టర్‌ను ఎం. హరినారాయణన్‌ను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి సంబంధిత కార్య దర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుండి వర్చువల్‌ గా సమావేశమై జిల్లాల్లో జరుగుచున్న ఫ్యామిలీ పీజీషియన్‌ విధానం అమలు, సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రాధాన్యత ఇండికేటర్స్‌ లక్ష్య సాధన, మహిళల ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, విద్య, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరఫరా, గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియో 100 శాతం అమలు తదితర అంశాలపై చేపట్టాలసిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఎస్‌.సి.డి./ సిడి సర్వేలో గుర్తించిన హైపర్‌ టెన్షన్‌, డయాబెటీస్‌ పేషంట్లను ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో డాక్టర్‌ తప్పక వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు నెల్లూరు కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణం నుండి జిల్లా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌, డిపిఓ సుస్మిత రెడ్డి, డీఈఓ గంగా భవాని, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి, డిఎం అండ్‌ హెచ్‌ఓ డా. పెంచలయ్య, డిసిహెచ్‌ ఎస్‌ రమేష్‌ నాథ్‌, ఐసిడిఎస్‌ పిడి హేనా సుజన, హౌసింగ్‌ పిడి నాగరాజు పాల్గొన్నారు.