Sep 21,2023 20:45

రాయచోటి : ప్రభుత్వం సూచించిన సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్యమైన 8 అభివద్ధి సూచికల్లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేకంగా కషి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి కలెక్టర్లు, జెసిలతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి వివిధ అంశాలలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని వివిధ అభివద్ధి సూచికలలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేందుకు కలెక్టర్లు అందరూ కషి చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర్‌ గిరీష పిఎస్‌ మాట్లాడుతూ ప్రజా జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అనీమియా నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో రక్తహీనత బాధితులను గుర్తించిన వారిలో హిమోగ్లోబిన్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలపై ఐసిడిఎస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎన్‌సిడిసిడి సర్వేలో ఆధార్‌ కరెక్షన్‌ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు కషి చేస్తుందని, ఆ దిశగా అధికారులందరూ కూడా పనిచేయాలని తెలిపారు. ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మంచి వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మన్ననలను పొందాలన్నారు. చిన్నపిల్లల ఆధార్‌ అప్డేషన్‌, విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై కూడా ప్రత్యేక దష్టి సారించి వంద శాతం పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా డ్రాప్‌ అవుట్‌ చిల్డ్రన్‌ పై దష్టి పెట్టాలని పదవ తరగతి అనంతరం కళాశాలలో చేరని వారిని ఓపెన్‌ స్కూల్లో చేర్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయా శాఖలలో పలు అంశాలపై సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కీలక అంశాల్లో సుస్థిరమైన, సమగ్రమైన అభివద్ధి సాధించాలని, ప్రభుత్వ శాఖలన్నీ పరస్పర సమన్వయంతో లక్ష్యాల సాధనకు కషి చేయాలని కలెక్టరు కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.