ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద బుక్కులు, యూనిఫారం, బ్యాగులు, బూట్లు సరఫరా చేసింది. వాటిని ఇటీవలే అన్ని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. బూట్ల కొలతల్లో తేడాలు రావడంతో వాటిని వాపస్ తీసుకొని విద్యార్థుల పాదాల కొలతలకు సరిపడే విధంగా ఉండే బూట్లను తిరిగి ఇచ్చేందుకు సోమవారం స్థానిక మండల రీసోర్స్ కేంద్రంలో షూస్ ఎక్స్ఛేంజ్ మేళా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు తమకు సరిపోని బూట్లను ఎంఆర్‌సి కేంద్రంలో అప్పగించారు. విద్యార్థుల పాదాల కొలతలను తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి తీసుకున్న పాదాల కొలతలతో పాటు వారి నుంచి వాపసు తీసుకున్న బూట్లను జిల్లా కేంద్రానికి పంపనున్నట్లు ఎంఇఒ-2 బాలానాయుడు తెలిపారు. తాజాగా విద్యార్థుల నుంచి తీసుకున్న పాదాల కొలతలకు అనుగుణంగా సరిపడే బూట్లు జిల్లా కేంద్రం నుంచి వచ్చాక విద్యార్థులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
బూట్లను పరిశీలిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు










