
ప్రజాశక్తి - భీమవరం
నరసాపురం సబ్ కలెక్టర్‌గా పని రోజుల్లోనే మంచి అధికారిగా ఎం.సూర్యతేజ గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ ఉద్యోగోన్నతి బదిలీపై ఏలూరు జిల్లా కోటరామచంద్రపురం ఐటిడిఎ పిఒగా వెళ్లిన సందర్భంగా జెసి, జిల్లా వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారి జిల్లా కలెక్టరేట్‌లో సూర్యతేజ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో జెసి ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, ఆర్‌డిఒ దాసిరాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : నరసాపురం హైవే ఇన్‌లో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సభకు ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ శాఖ సూర్యతేజకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.