పూజలు చేస్తున్న నరహరిశాస్త్రి
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పార్వతీపురం పట్టణ శివారులోని సూర్యపీఠంలో ఆదివారం వేమకోటి నరహరిశాస్త్రి ఆధ్వర్యంలో సూర్య భగవానునికి విశేష పూజలు చేశారు. సూర్య నమస్కారాలు, సౌర హోమం, సుదర్శన హోమం, ఆదిత్య పంచాయతన క్షీరాభిషేకం, మిత్ర రవి, సూర్య, భాను, ఖగ, పూష హిరణ్యగర్భ మరీచి, తదితర దేవతలకు పూజలు చేశారు. అనంతరం నవనాగ అర్చన, నవగ్రహ హోమం, విశ్వశాంతి మంత్ర హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమకోటి వివేకానంద, తదితరులు పాల్గొన్నారు.










