Jul 16,2023 01:40
సూర్యలంక బాధితులను పరామర్శిస్తున్న విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ

ప్రజాశక్తి-బాపట్ల: సూర్యలంక బాధితులను బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు కట్టా శ్రీనివాసరావు, గుదే రాజారావు పరామర్శించారు. శనివారం కమిటీ సభ్యులు సూర్యలంకను సందర్శించారు. ఈ నెల 11న బాపట్ల జిల్లా అడవి పంచాయతీ సూర్యలంక బీచ్‌ వద్ద గిరిజన కుటుంబాలు నివసిస్తున్న స్థలాన్ని బీచ్‌ అభివృద్ధిలో భాగంగా ముదస్తు సమాచారం లేకుండా గ్రామ రెవెన్యూ అధికారి పూరిగుడిసెలను తొలగించి సామగ్రిని సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌లో పడేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిడ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ దేవరపల్లి డేవిడ్‌ రాజ్‌, కవిత సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి ఏపూరి జోసెఫ్‌ పాల్గొన్నారు.