Aug 16,2023 15:04

77 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న సూర్య విద్యాలయ విద్యార్థులు

ప్రజాశక్తి - తొండంగి
తొండంగి మండలం కొత్త పెరుమాళ్ళపురం గ్రామంలో ఉన్న సూర్య విద్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. సూర్య విద్యాలయ చైర్మన్‌ కోమాకుల శివ ప్రసాద్‌రావు, కోమాకుల ఎడ్యుకేషనల్‌ సొసైటీ సూర్య విద్యాలయ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్‌రావు, అమ్మాజీ దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి అసువులు బాపిన అల్లూరి సీతారామరాజు, భగత్‌ సింగ్‌, ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీజీ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి దేశ నాయకులు వేషదారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం 77 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు చేతబట్టి గ్రామంలో ఆవుల మంద, బుచ్చయ్యపేట, పాత పెరుమాళ్ళ పురం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.గేశ్వరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు