Jul 13,2023 21:50

ధ్రువపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి-సీతంపేట : జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అయ్యాయని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. మండలంలోని శంబాం, కుసిమి సచివాలయాల పరిధిలో ఎంపిడిఒ కె.సత్యం ఆధ్వర్యంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమానికి మరింత భరోసానిచ్చేందుకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని తెలిపారు. ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా సచివాలయాల ద్వారా అందిస్తున్న 11 రకాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, మరణ, జనన, పొలం పట్టాదారు పాసు పుస్తకాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, హౌస్‌ ఓల్డ్‌ మ్యాపింగ్‌, కొత్త రేషన్‌ కార్డులు కోసం అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులందరికీ ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహన్‌ రావు, వైస్‌ ఎంపిపి కె.సరస్వతి, డిప్యూటీ తహశీల్దార్‌ నాగేంద్ర కుమార్‌, మధుసూదన్‌రావు, ఎపిఒ సాగర్‌, నాయకులు సవర రాము, సర్పంచులు సవర కూర్మారావు, నిమ్మక తిరుపతిరావు, ఎంపిటిసి నిమ్మక గణేష్‌, వైసిపి నాయకులు ఆరిక గణేష్‌, కార్యదర్శులు రాజశేఖర్‌, వినోద్‌, తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : జగనన్న సురక్షను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ పైడితల్లి కోరారు. మండల పరిధిలోని సంతోషపురంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి ధ్రువపత్రాలను జారీచేసి, పథకాలను అందించాలని సిబ్బందికి సూచించారు. జగనన్న సురక్ష ద్వారా మంజూరైన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో డిటి పి.సత్యలక్ష్మికుమార్‌, మాజీ సర్పంచ్‌ అంబటి గౌరునాయుడు, అశోక్‌ బ్రహ్మ, గ్రామ సచివాలయ కార్యదర్శి రేవళ్ల చరణ్‌ పండిట్‌, పి.రాజేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.