రోగిని పరీక్షిస్తున్న డాక్టర్ డివిజి శంకర్రావు
ప్రజాశక్తి-విజయనగరం : మెంటాడ మండలం జక్కువ లో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర రావు సందర్శించారు. స్వతహాగా వైద్యులు అయినందున పలువురికి ఆరోగ్య పరీక్షలు చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలను అందజేశారు.అంతకుముందు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో పలువురు జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు. ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులపై వివరాలు అడిగారు. అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గెస్ట్ హౌస్‌లో జిల్లా ఎస్‌పి దీపిక చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు.










