Oct 17,2023 22:32

ప్రజాశక్తి -అమలాపురం
సముద్ర తీర ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు, రహదారుల నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు మంగళ వారం అల్లవరం మండల పరిధిలోని మొగళ్ళమూరు గ్రామంలో వేదాంత క్లీన్‌ ఎనర్జీ ఒఎన్జిసి సిఎస్‌ఆర్‌ నిధులైన రూ.28.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 40వేల లీటర్ల కెపాసిటీ గల ఓవర్‌ హెడ్‌ ట్యాంకును మంత్రి పినిపే విశ్వరూప,్‌ ఎంపీ చింతా అనురాధ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుతగా తాగునీటి సరఫరా ఓహెచ్‌ఎస్‌ఆర్‌ మంత్రి, మంత్రి పార్లమెంట్‌ సభ్యులు ప్రారంభించారు.కొమరగిరిప ట్నం ఆర్‌ అండ్‌ బి రోడ్‌ నుండి జాంబవానిపేట (వయా) ఉత్తగుంటసావరం వరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నిధులైన రూ.70.53లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డును మంత్రి, శాసనమండలి సభ్యులు ప్రారంభించారు. కొమరగిరిపట్నంలో పంచాయి తీరాజ్‌ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నిధులైన రూ.258.87 లక్షల అంచనా వ్యయంతో కొడప నుంచి కొడపదిరి బ్రిడ్జి నిర్మాణంతో సహా నిర్మించిన పంచాయతీరాజ్‌ రోడ్డును మంత్రి, శాసన మండలి సభ్యులు ప్రారంభించారు. అనంతరం అమలాపురం- బెండమూర్లంక ఆర్‌ అండ్‌ బి రోడ్డు నుండి రెబ్బనంపల్లి వయా వరద కట్ట మీదుగా పాలగుంట చెరువు వరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ రోడ్డు ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.128.99 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డును మంత్రి, శాసనమండలి సభ్యులు ప్రారంభించారు. మొగళ్లమూరు రోడ్డు వయా జాంబవానిపేట గురుకుల పాఠశాల ఎస్‌సి ప్రాంతం వరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నిధులైన సుమారు రూ.92.44 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్‌ అండ్‌ బి రోడ్డును మంత్రి, శాసన మండలి సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తీర ప్రాంత ప్రజలకు రహదారుల వసతి కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు దంగేటి డోలామణి రుద్ర, జెడ్‌పిటిసి సభ్యుడు గౌతమి, ఎంపిపి శేషారావు, కె.బాపూజీ, సురేష్‌ వర్మ చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.