ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలం గసభ పంచాయతీ గ్రామాల్లోని గిరిజనులకు ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్థానిక సిపిఎం సర్పంచ్ పి సునీత చెప్పారు. మండలంలోని గసభ పంచాయతీ లోగిలి గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులతో మంజూరైన గ్రావిటీ పథకానికి ఆదివారం ఆమె శంకుస్థాపన చేసి పైపులైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ నిధులు సుమారు రూ3.70 లక్షలతో పైపులైన్ పనులు చేసి వీధి వీధుల్లో కొళాయిలు ఏర్పాటు చేసి మంచి నీరు అందిస్తామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రావిటీ పధకాన్ని మరమ్మతు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గసభ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్, ఉప సర్పంచ్ కొర్రా మహదేవ్, వార్డుమెంబర్స్ పాంగి సత్యనారాయణ, శాంతి, పార్వతి, పంచాయతీ సెక్రటరీ కొర్రా గురుమూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గణేష్, విఆర్వో ప్రసాద్ రావు, గ్రామ వాలంటీర్స్, పాల్గొన్నారు.










