
డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
నియోజకవర్గ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యమని ఆ విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. జల జీవన్ మిషన్‌లో మోగల్లుకు మంజూరైన రూ.60 లక్షలతో నిర్మించనున్న ఒహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం, పైప్ లైన్లు ఏర్పాటు కు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పథకంలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు. వైసిపి యూత్ విభాగం అధ్యక్షులు పెనుమత్స వెంకట్రాజు ( బాబు ) మాట్లాడుతూ మోగల్లు గ్రామాభివృద్ధికి పివిఎల్ ప్రత్యేక నిధులు కేటాయించి ఎంతో సహాయసహకారం అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచి పెనుమత్స సీతారామరాజు (సీతయ్య), ఎంపిటిసిలు కాటూరి శాంతకుమారి, పెనుమత్స వెంకటలక్ష్మి, మంతెన బాపిరాజు, జాలే సునీత పాల్గొన్నారు.
అవగాహన కల్పించాల్సిందే
మోగల్లు అతిపెద్ద గ్రామమని, ఇక్కడ జనాలు తక్కువ వచ్చారని, అవగాహనా లోపమా లేక పబ్లిసిటీ చేయకపోవడమా ఒకసారి ఆలోచన చేయాలని డిసిసిబి ఛైర్మన్ నరసింహరాజు అన్నారు. మోగల్లు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పివిఎల్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తుంటే అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివద్ధి అధికారి మురళి గంగాధర్‌రావు, తహశీల్దార్ షేక్ హుస్సేన్, సిపి యూత్ విభాగం అధ్యక్షులు పెనుమత్స వెంకట్రాజు పాల్గొన్నారు.