ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీదేవి
'సురక్ష' విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలో సెప్టెంబర్‌లో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపిడిఒ శ్రీదేవి అన్నారు. మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే జరుగుతుందన్నారు. 30వ తేదీ నుంచి వైద్య శిబిరాలు సచివాలయ పరిధిలో జరుగుతాయన్నారు. జగనన్న లే అవుట్ లలో పక్కా గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలా చూడాలన్నారు. మండలంలో బడివీడు కలిగి బడిబయట ఉన్న ఐదు నుండి 18 సంవత్సరాల వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










