Nov 17,2023 23:49

హెచ్‌ఒడిలతో సమావేశంలో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌

గుంటూరుజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నుంచి వచ్చే రోగులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సూచించారు. శుక్ర వారం శుశ్రుత హాలులో ఆసుపత్రి హెచ ్‌ఒడిలతో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రతి రోగి కి వైద్య పరీక్షలు చేసి అవసరమైతే అడ్మిట్‌ చేసేవిధంగా చర్యలు తీసు కోవాలని, ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతి విభాగం హెచ్‌ఒడి బాధ్యతగా తీసు కోవా లని అన్నారు. ప్రతిరోజూ ఆరోగ్య సురక్ష సమాచార కేంద్రాన్ని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీశిలించి అవసరమైన వైద్య సూచనలు పిజిలకు సూచించాలని చెప్పారు. సమాచార కేం ద్రానికి వచ్చినప్పుడు రోగుల అవసరాలను ముందుగా గుర్తించి వారికీ అవసరమైన వైద్య పరీక్షలు చేయాలని, అవసరం అను కుంటే వెంటనే వార్డుల్లో చేర్పించేలా సహకరించాలని చెప్పారు. రానున్న రోజుల్లో ఆసుపత్రికి నూతనంగా సిటి స్కాన్‌, ఇచ్చేందుకు ఉన్న తాధికారులు అంగీకరించినట్లు చెప్పారు. సిటీ స్కాన్‌ రాగానే సర్వీస్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసేం దుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అత్యవవసర విభాగం క్యాజువాల్టీ కి వచ్చిన రోగు లకు తక్షణమే వైద్యం అం దించాలని , క్యాజువాల్టీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పర్య వేక్షించాలని, రోగుల శస్త్ర చికిత్సల కోసం రెండు ఆపరేషన్‌ థియే టర్లను అందు బాటులో ఉంచామని, ఆలస్యం జరగ కుండా సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆప రేషన్‌ ధియేటర్‌ వద్ద బ్లడ్‌ బ్యాంకు కూడా అందుబాటులో ఉంచా మని, అనస్థీషియా విభాగం వైద్యులు కూడ సహకరించాలని అన్నారు. రాత్రి సమ యాల్లో రోగులు ఎక్కువమంది రావడం వల్ల క్యాజువాల్టీ పూర్తిగా రద్దీగా మారు తోందని,రోగులను ఎప్పటికప్పుడు వార్డులోకి మార్చాలని చెప్పారు. ఆసుపత్రి లోని మృతదేహాలను సకాలంలో వారి స్వస్థ లాలకు మహాప్రస్థానం ద్వారా పంపిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఆర్‌ యస్‌ను సమర్ధ వం తంగా చేసేలా శ్రద్ద తీసుకోవాలని అన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరిం టెం డెంట్లు డాక్టర్‌ గోవిడ్‌ నాయక్‌, డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎమ్‌ఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, ఎడి సుధాకర్‌ పాల్గొన్నారు.