
గుంటూరు: జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భరోసా లభిస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం గుంటూరు నగరంలోని బృం దావన్ గార్డెన్స్ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ తో కలిసి మేయర్ సందర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బూసి రాజలత, షేక్ మహమూద్, టి.యల్.వి ఆంజనేయులు,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎంహెచ్‌ఒ భాను ప్రకాష్ పాల్గొన్నారు.