సూర్జిత్ భవన్‌కు తాళాలు వేయడం దారుణం
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : న్యూఢిల్లీలో జి-20కి సంబంధించిన ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో ఏర్పాటు చేసిన సెమినార్ కమ్ వర్క్‌షాప్‌ను ఆపేందుకు ఢిల్లీ పోలీసులు యత్నంచయడాన్ని ఆత్మకూరు సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆదివారం సిపిఎం కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ అసమ్మతి గళాలను నొక్కేసే ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం సమంజసనీయం కాదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే శాఖరాగ్ర సదస్సును పురస్కరించుకొని శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు వివ్-20 సదస్సును నిర్వహించాలని ప్రజాసంఘాల వేదిక నిర్వహించిందని తెలిపారు. దానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నేతలు, పాత్రికేయులతో పార్టీల కతీతంగా సదస్సులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సులు వివిధ అంశాలపై ప్రత్యామ్నాయ విధానాలను చర్చిస్తారని తెలిపారు. శుక్రవారం సదస్సు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రెండవ రోజు శనివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పోలీసులు సదస్సు జరుగుతున్న హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌కు చేరుకుని ప్రధాన గేటుకు తాళాలు వేశారని తెలిపారు. సదస్సు లేదని చెబుతూ బారికేడ్లను ఏర్పాటు చేశారన్నారు. అక్కడకు చేరుకున్న వారిని బలవంతంగా పంపించే ప్రయత్నాలు చేశారని, వెళ్లకపోతే భవనాన్ని సీజ్ చేస్తామని బెదిరించారన్నారు. ఇప్పటికే పలువురు సమావేశ మందిరంలోకి చేరుకుని ఉండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. లోపల ఉన్న వారు బయటకు, బయట ఉన్నవారు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారన్నారు. అనంతరం పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు ఢిల్లీ పోలీసుల నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధానిలో చర్చలు సెమినార్లు నిర్వహించుకునేందుకు పౌరులకు ప్రజాస్వామ్య హక్కులలో ఢిల్లీ పోలీసుల ద్వారా జోక్యం చేసుకునే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం తక్షణమే ఆపుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జివి శివప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, ఎపి రైతు సంఘం మండల కార్యదర్శి లక్కు కృష్ణప్రసాద్, ఐద్వా నాయకురాలు షేక్ గుల్జార్‌బేగం, సిపిఎంనాయకులు ఎం.నాగేంద్ర, ఆళ్ల.హజరత్తయ్య, వాగాల శ్రీహరి, కొండ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.










