ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం, చిప్పాడ పంచాయతీ, సిటీనగర్‌కు చెందిన రవ్వ సూరిబాబు మృతికి సిఐటియు, కెవిపిఎస్, ఐద్వా, డివైఎఫ్ ఐ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉన్నత చదువు లు చదివి, జిల్లా సహకార బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సూరిబాబు శుక్రవారం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. సూరిబాబు భౌతిక కాయాన్ని సిఐటియు భీమిలి జోన్ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శి రవ్వ నరసింగరావు, సిఐటియు నాయకులు ఎస్ అప్పల నాయుడు, ఐద్వా నాయకులు కె నాగరాణి, ఎస్ గున్న, భవాని, కెవిపిఎస్ నాయకులు భాగం లక్ష్మి, సోమి వెంకట్, గందవరపు కృష్ణ, ఎం శివ తదితరులు సందర్శించి సంతాపం తెలిపారు. ప్రతి అంశాన్ని సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తి సూరిబాబు అని ప్రజాసంఘాల నేతలతోపాటు పలువురు కొనియాడారు.










