Mar 29,2023 01:09
పరీక్షా కిట్లు అందజేస్తున్న ఫౌండేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని సురేపల్లి విపిఅండ్‌జిఎస్‌ఎం ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కిట్లను అందజేశారు. ఫౌండేషన్‌ అధ్యక్షులు కైతేపల్లి సాల్మన్‌రాజ్‌ మాట్లాడుతూ విద్యా ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు విజ్ఞతతో విద్యానభ్యసించి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్‌ సభ్యులు యాన్నం సురేష్‌, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసశర్మ తదితరులు ఉన్నారు.