Aug 11,2023 21:02

మోగా చెక్కు విడుదల చేస్తున్న ఇన్‌ఛార్జి మంత్రి, తదితరులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : సున్నా వడ్డీ కింద జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 52.38 కోట్లు మంజూరు అయింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో బటన్‌ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు మంజూరు చేశారు. సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ లో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం తో పాటు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు, కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు స్థానిక నాయకులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అనంతరం జిల్లాలోని 36,928 సంఘాలకు 3,91,440 మంది మహిళలకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీకి సంబంధించి రూ. 52.38 కోట్లు మెగా చెక్కును సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, అగ్రి బోర్డు చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, వైస్‌ చైర్మన్లు శ్రీలక్ష్మి, తిప్పన్న, పుడా చైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ కొండయ్య, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.