సునీత చోప్రా మృతి వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి ఆత్మకూర్
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం లో సుదీర్ఘకాలం పాటు సహాయ కార్యదర్శి గా వ్యవసాయ కూలీల పోరాటాలకు అండగా నిలిచిన కామ్రేడ్ సునీత్ చోప్రా హఠాన్మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరనిలోటని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు సిఐటియు పట్టణ కార్యదర్శి డి రామ్ నాయక్ ప్రజానాట్యమండలి నాయకులు డాలు వెంకటేశ్వర్లు జోసెఫ్ చంద్రశేఖర్ ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు మా భాష అన్నారు బుధవారం నాడు సుదర్శన వర్మ స్మారక భవనంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్స్ సునీత చోప్రా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రామ్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ సునీత చోప్రా గారు 1941 డిసెంబర్ 24వ తేదీన లాహోర్లో జన్మించారు లండన్ లో బి ఎ ఆనర్స్ చదువుతున్నప్పుడు కమ్యూనిస్టులతో సంబంధాలు ఏర్పడ్డాయి అనంతరం పాలస్తీనాలో జరిగే విముక్తి ఉద్యమంలో చోప్రా గారు భాగస్వాములయ్యారు జేఎన్యులో పీహెచ్డీ చేసే సందర్భంగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి వ్యవస్థాపక సభ్యుడయ్యారు 1972లో డివైఎఫ్ఐ నిర్మాణంలో కీలకపాత్ర వహించారు 1984 లో డివైఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు 1987 నుండి 2023 దాకా వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత సహాయ కార్యదర్శిగా ఉంటూ అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు ఉన్నత చదువులు చదివి కష్టజీవుల విముక్తి కోసం జీవితాంతం భుజానికి ఎత్తుకున్న జెండాను దించకుండా అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప నాయకుడు కామ్రేడ్ సునీత్ చోప్రా గారు ఆయన మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటని ఆయన ఆశయ సాధన కోసం వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నిశ్చయంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ పోరా సంక్షేమ సంఘం నాయకులు సురేంద్ర సిఐటియు నాయకులు ఇస్మాయిల్ రవి మల్లయ్య సమతా సైనిక్ దళ్ నందికొట్కూరు అధ్యక్షులు సగీనాల సురేష్ గణపతి తదితరులు పాల్గొన్నారు










