Dec 11,2022 23:43

నిలిచిన వాహనాలు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయ మండలం సుంకరమెట్ట కాఫీ తోటల ఘాట్‌ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. శని, ఆదివారం సెలవు రోజు కావడంతో మాండూస్‌ తుఫాన్‌ సైతం లెక్క చేయకుండా దేశ విదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో రోడ్డుపై అర్ధగంట పాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రాకపోకలు స్తంభించి పోయాయి. వెంటనే అరకు పోలీసు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జీడి బాబుకు స్థానికులు సమాచారం అందించారు. సీఐ తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో వాహనాలు యధావిధిగా రాకపోకలు కొనసాగించాయి.