May 30,2023 22:54

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌: భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రకాష్‌ నగర్‌ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి సభ్యులు దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ వారి ఆదాయానికి గండి కొడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, నగర కమిటీ సభ్యులు సిహెచ్‌ శ్రీనివాస్‌, జి.ఝాన్సీ రాణి, ఎస్‌.కె పీరు సాహెబ్‌, జి. సుజాత, కార్యదర్శులు టి. శ్రీనివాస్‌, ఎస్కే నిజాముద్దీన్‌, ఎం. రామాంజనేయులు, పి.వెంకటరెడ్డి, పి. సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.