
సుందరయ్యచిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-నక్కపల్లి:ఆదర్శ కమ్యూనిస్టు నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు కొనియాడారు. .మండలంలోని రాజయ్యపేట లో ఆదివారం సుందరయ్య 38వ వర్ధంతి పురస్కరించుకుని గ్రామ ప్రజల సమక్షంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పలరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్ మాట్లాడారు.ఈ తరం యువకులకు సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భరినికల రాము, యాదగిరి నవీన్, మామిడి నానాజీ, మైలపల్లి మహేష్, పీక్కి రమణ గోసలస్వామి, మైలపల్లి జాను, సోమేశ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.