May 28,2023 00:41

నివాళులర్పిస్తున్న అప్పలరాజు ,గ్రామస్తులు

ప్రజాశక్తి-నక్కపల్లి:కమ్యూనిస్టు నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు కొనియాడారు. మండలంలోని గునుపూడి లో శుక్రవారం రాత్రి సుందరయ్య 38వ వర్ధంతి పురస్కరించుకొని గ్రామ ప్రజల సమక్షంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పలరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌లు మాట్లాడుతూ, కామ్రేడ్‌ సుందరయ్య వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారని తెలిపారు. సైకిల్‌ పై పార్లమెంటు కు వెళ్లి అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన ఆదర్స నేత సుందరయ్య అని కొనియాడారు. సమాజంలో అసమానతలు రూపు మాపమాలని పోరాటం చేసిన ఆదర్శ వంతుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు భరినికల రాము, యాదగిరి నవీన్‌, రాయుడు కనకేశ్వరరావు, పిల్లి తాతారావు,వాతాడ అప్పారావు, రాయుడు దండు బాబు,మాసా యేసు బాబు,మనబాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.