May 20,2023 00:37

సుందరయ్యకు ఘన నివాళి



తగరపువలస : సిఐటియు భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యాన తగరపువలస ప్రైవేట్‌ మార్కెట్‌ వై జంక్షన్‌లో, భీమిలి చిన్న బజారు జంక్షన్‌లో వర్థంతిని జరిపారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్‌.అప్పలనాయుడు, ముఠా, ఆటో కార్మిక సంఘాల నాయకులు కొత్తయ్యరెడ్డి, నీలాతి రాము తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : భెల్‌ విశాఖ యూనిట్‌లో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిటిపి ప్రకాష్‌, ఎస్‌.జగన్నాధరావు, జి.రాంబాబు, బి.కృష్ణమూర్తి, పి.శివరాం, ఆర్‌.జనార్థనరావు పాల్గొన్నారు.
జివిఎంసి 71వ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆరిలోవ : ఆరిలోవ సిపిఎం జోన్‌ ఆధ్వర్యాన 9, 10, 11, 12, 13 వార్డుల్లో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. సిపిఎం, సిఐటియు, ఐద్వా, ప్రజా సంఘాల నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కెఎస్‌వి.కమార్‌, వి.నరేంద్రకుమార్‌, పి.శంకరరావు, డి.నాగరాజు, ఐసి.నాయుడు, ఎస్‌.గౌరి, ఎ.రమణ, జి.నాగరాజు, బి.రత్నం, సన్యాసమ్మ, పి.రాము తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : మల్కాపురం సిఐటియు ఆఫీసులో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కె.పెంటారావు, ఉరుకూటి బాబూరావు, ఆర్‌.విమల, కె.బంగారురాజు, గణేష్‌, బి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన 58వ వార్డు పరిధి గుల్లలపాలెం, 59వ వార్డు పరిధి నెహ్రూనగర్‌, 61వ వార్డు పరిధి మల్కాపురం, 62వ వార్డు పరిధి త్రినాధపురం, దుర్గానగర్‌, అల్లూరిసీతారామరాజు కాలనీ, 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌, చింతల్లోవ ప్రాంతాల్లో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నాయకులు పివి.బాస్కరరావు కె.పెంటారావు, జగ్గునాయుడు, టి.అప్పలస్వామి, ఆర్‌.కర్రెయ్య, వి.బాబూరావు, కె.పోలమ్మ ఆర్‌.లక్ష్మణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 63వ వార్డు క్రాంతినగర్‌లో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అలుపెరగని కమ్యూనిస్టు పొరాటయోధుడు సుందరయ్య అన్నారు. దేశంలో మొదటి ప్రతిపక్షనేతగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు లక్ష్మణమూర్తి, పి.సురేష్‌, పివి.భాస్కర్‌, గోపాల్‌, పొన్నాడ రామారావు ఎల్‌.కృష్ణ, రాజు, రాజేష్‌, రామునాయుడు, ఆర్‌.విమల, ఉమ, మమత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : జివిఎంసి 6వ వార్డు పరిది పిఎం.పాలెం ఎస్‌బిఐ కూడలి వద్ద సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎంవి.ప్రసాద్‌, డి.అప్పలరాజు, ఎస్‌.రామప్పడు, సిహెచ్‌.శేషుబాబు, కె.నాగరాజు, జి.కిరణ్‌, కె.రాజ, బి.రాంబాబు, కె.అర్జునమ్మ, ఉమ, జిఎ.రెడ్డి, ఆదిలక్ష్మి, శుభ, సూరిబాబు పాల్గొన్నారు.
మాధవధార : మాధవధారలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు సనపల ఆంజనేయులు, సనపల అమ్మలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కంచరపాలెం జోన్‌ కార్యదర్శి బి.పద్మ, సిఐటియు నాయకులు కూన వెంకటరావు, నాయకులు కూన పార్వతి, కె.సుధాకరరావు, ఎస్‌.రామ్‌గోపాల్‌రావు, కె.సత్యనారాయణ, పి రామచంద్రరావు, పి.పాండురంగారావు, జిఎన్‌.మూర్తి, సనపల కరుణ, నాయని బాబు, అనురాధ, నాయుడుబాబు, పి.శ్రీదేవి, ఎస్‌.శ్రావణ్‌కుమార్‌, కె.జనార్ధనమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 8వ వార్డు బింద్రానగర్‌ సుందరయ్య పార్కులో షిప్‌యార్డు లే-అవుట్‌ కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యాన సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.బాబూరావు, ఇటి శేషగిరిరావు, జి.కిరణ్‌, సిహెచ్‌.సత్యానంద్‌, సిహెచ్‌.శేషుబాబు, గోవిందరాజు, బాపూజీ, రమేష్‌, బి.భారతి, డి.కొండమ్మ పాల్గొన్నారు.
పెందుర్తి : అప్పలనరసయ్య కాలనీ, చైతన్య నగర్‌ కార్మిక నగర్‌ పేపర్‌ కంపెనీ, పెందుర్తి సిఐటియు కార్యాలయంలో సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి.జగన్‌, బిటి.మూర్తి, అప్పారావు, శంకరరావు, జగన్నాధంస్వామి, మౌలాలి, రజిని పాల్గొన్నారు.
కంచరపాలెం : కంచరపాలెంలోని బిఎన్‌ఆర్‌ భవనంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌.సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, చిన్న వయసులోనే పుస్తకాలు చదవడం, సామాజిక అంశాలను అధ్యయనం చేశారన్నారు. భూ స్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ వ్యవసాయ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర నీటి పథకం అవకాశాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విప్లవ పదంలో నా పయనం పుస్తకాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. సుందరయ్య అంటేనే ఒక మహాశక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.వెంకటరావు, ఎమ్‌.ఈశ్వరరావు, ఒ.అప్పారావు, ఎ.పుష్ప, రమణ, కె.రాంబాబు, ఎస్‌.అప్పలరాజు, పివి.రమణ పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : సింగ్‌ హోటల్‌ జంక్షన్‌లో సుందరయ్య వర్థంతి కార్యక్రమం జరిగింది. కె.నర్సింగరావు అధ్యక్షత వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సింగనాయుడు, ఇతర నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. విశాఖ జిల్లా మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు మాట్లాడారు. పూర్ణా మార్కెట్‌ స్ప్రింగ్‌ రోడ్‌ వద్ద ఎం.సుబ్బారావు అధ్యక్షతన సుందరయ్య వర్థంతి కార్యక్రమం ముఠా కళాసీ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగింది. యూనియన్‌ గౌరవ అధ్యక్షులు వై.రాజు మాట్లాడారు. సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, వై.పైడిరాజు, నాయుడు పాల్గొన్నారు.
28వ వార్డులో సిఐటియు జగదాంబ జోన్‌, ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో సుందరయ్య వర్థంతి కార్యక్రమం చేపట్టారు. నాయకులు కె.మణి మాట్లాడారు. బి.సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె నర్సింగరావు, సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి పాల్గొన్నారు.
ప్రజాశక్తి ఆధ్వర్యాన..
ఉక్కునగరం : ఆటోనగర్‌లోని ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ కార్యాలయంలో సుందరయ్య వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. పత్రిక జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడారు. జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు కె.అప్పలనాయుడు, వై.సత్యనారాయణ, విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి : ఆదర్శ కమ్యూనిస్టుగా, ఆదర్శనేతగా, అజాతశత్రువుగా పిలవబడే సుందరయ్య నేటితరానికి ఆదర్శప్రాయుడని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ, సిపిఎం మండల కన్వీనర్‌ గంట శ్రీరామ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం నేతలు కె.ఈశ్వరరావు, బి.ఉమామహేశ్వరరావు, తేల్లయ్యబాబు, బి.నూకఅప్పారావు, కె.సుజాత, పి.చలపతి పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌: మండల కేంద్రం మెయిన్‌ రోడ్డులో, గవర్ల అనకాపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని గ్రంథాలయంలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఎస్‌. బ్రహమ్మాజీ, టెక్కలి జగ్గారావు, వేగి మహేష్‌ , ఆదారి సత్యనారాయణ, మద్దాల పద్మ, వరలక్ష్మి, ద్వారంపూడి లక్మి, ఆడారి శ్రీలక్మి, విజయలక్ష్మి, మంగ, ఇందిర, జగ్గయ్యమ్మ పాల్గొన్నారు. తోటాడలో సుందరయ్యకు ఆళ్ల మహేశ్వరరావు, ఆడారి రామలక్ష్మి, నిర్మలకుమారి, పెంటకోట జోగి నాయుడు పోలమరశెట్టి బాగేశ్వరరావు, మళ్ల సత్యనారాయణ, పోల్న్షటి మహాలక్ష్మినాయుడు, దోడ్డి రాజమ్మ,దాడి శ్రీను, దోడ్డి సూర్యనారాయణ తదితరులు నివాళులర్పించారు.
దేవరాపల్లి : మండలంలోని పలుగ్రామాల్లో సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి, దొర, కె సన్యాసి, సిహెచ్‌ దేముడు, కె ఈశ్వరరావు, సిహెచ్‌ గంగులు, ఎం.దేముడు, నాగేశ్వరరావు, పి అప్పలరాజు, డి శంకర్‌, జి దేముడు, బి గోపాల్‌, డి దాసు పాల్గొన్నారు
పరవాడ: పరవాడ తహశీల్దార్‌ కార్యాలయ జంక్షన్‌లో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం నేతలు ఎస్‌ రమణ, పి మాణిక్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రమణ, తరుణ, జి వి ఎస్‌ తేజ, కె.మనోజ్‌, సిఐటియు నాయకులు రమణ, అనకాపల్లి వరలక్ష్మి, అనకాపల్లి చంద్రకళ పాల్గొన్నారు.
రాంబిల్లి : సుందరయ్య చిత్రపటానికి. సిపిఎం జిల్లా కార్యదర్సి జి.కోటేశ్వరరావు పూలమాల వేసి, నివాళ్ళు అర్పించారు. సిపిఎం కమిటి సభ్యులు జి. దేముడునాయుడు, మండల నాయకులు. ఎన్‌.నారాయణరావు, సిహెచ్‌.అప్పలరాజు, సిహెచ్‌. శివాజీ, వై.రాము, సిహెచ్‌.రామకృష్ణ, లక్ష్మినారాయణ.. డి.కాశియ్య, సిహెచ్‌. నూకన్న, ఇ.గంగాధరరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు: స్థానిక సిఐటియు కార్యాలయం సుందరయ్య చిత్రపటానికి ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి, సిపిఎం మండల నాయకులు రంగలు ముత్యాలయుడు సంఘాల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, వరి వెంకట్రావు, గోగాడ ఈశ్వరమ్మ, శక్తి రమణ, వి.ఈశ్వరరావు, నాగరాజు, సూర్యదేవుడు పాల్గొన్నారు.
సబ్బవరం: మండలంలోని వంగలి, సబ్బవరం సాయినగర్‌ కాలనీలలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రభావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, నేతలు యర్రా సోంబాబు, మొల్లేటి గౌరీశ్వరరావు, యర్రా బుల్లిబాబు, జెట్టి వెంకటేష్‌, ముమ్మన శ్రీను పాల్గొన్నారు.
కశింకోట: సిఐటియు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి వేడుకలలో సిఐటియు నేత దాకారపు శ్రీనివాసరావు, సిపిఎం నేత డి వరలక్ష్మి, ఆర్‌ శేషు, ఎమ్‌ ప్రభ, ఎమ్‌ అప్పలనర్సమ్మ, సీతా, కుమారి పాల్గొన్నారు
అచ్చుతాపురం మండలంలోని తిమ్మరాజుపేట, హరిపాలెం, అచ్చుతాపురం తదితరగ్రామాల్లో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు కర్రి అప్పారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచి దళితులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన సుందరయ్య పోరాటస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని కోటేశ్వరరావు కొనియాడారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఆర్‌ రాము, తిమ్మరాజుపేట శాఖ కార్యదర్శి ఎస్‌ రామ్‌ నాయుడు, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌ కనుమనాయుడు, బుద్ధ రంగారావు, కే సోమినాయుడు, ఆర్‌ లక్ష్మి, నడుపూరు సన్యాసిరావు పాల్గొన్నారు
నక్కపల్లి: కమ్యూనిస్టు నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌ లు మాట్లాడుతూ, ఆయన జీవితం పేదలకే అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భరినికల రాము, పిక్కి రాజు, అయినవిల్లి లోవరాజు, మనబాల బంగార్రాజు, భరినికల చంటి, మనబాల రాజు, మనబాల వీరబాబు, గోసల రాజు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో సుందరయ్య వర్ధంతి సందర్బంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సింగారపు వలసయ్య, పాడి బన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: పట్టణంలో సుందరయ్య వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి సత్తిబాబు, తదితరులు చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గీతాకృష్ణ, సాంబ,
రాము తదితరులు పాల్గొన్నారు.
మాడుగుల:మండలంలో సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అవురువాడ పంచాయతీ చినగొర్రె గెడ్డ గ్రామంలో ఉపాధి పనుల ప్రదేశంలో సుందరయ్యకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భవాని, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.