ప్రజాశక్తి- కందుకూరు : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలు ,నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కందుకూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఏ గౌస్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రచార జాతా కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రజలు అనేక సమస్యలను సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతకు వివరించినట్లు తెలిపారు.డిగ్రీలు, పీజీలు చేసిన యువత ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం పట్టణ నాయకులు ఎస్‌కె మున్వర్ సుల్తానా, డి రామ్మూర్తి, టీ వెంకట్రావు, ఎం పద్మ, ఎస్ పవన్ కుమార,్ డిఎం రాయుడు తదితరులు అందజేశారు.










