Nov 05,2023 00:07

పిడుగురాళ్ల: ఏళ్ల తరబడి నివసిస్తున్న సుందరయ్య కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్‌ కెఎస్‌ చక్రవర్తికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ పట్టణీకరణ నేప థ్యంలో పేద ప్రజలు, కార్మికులు అద్దెకు ఇళ్లు దొర కక ఇబ్బంది పడుతున్న తరుణంలో సిపి ఎం 2007లో పేదలతోటి సుందరయ్య కాలనీని ఏర్పాటు చేసిందని చెప్పారు. నేటికీ సుందరయ్య కాలనీకి ఎలాంటి సౌక ర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం ఇంటి పట్టాలు కూడా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్య దర్శి తెలకపల్లి శ్రీనివాస రావు మాట్లా డుతూ కాలనీలో కొంతమంది దళారులు పేదల ఇళ్ల స్థలాలను లాక్కుం టున్నారని, వెంటనే అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో మౌలిక సౌక ర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ వెంక టేశ్వర్లుకు సిపిఎం బృందం వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, కాలనీ వాసులు రామారావు ,కిషోర్‌ ,దేవేంద్ర, ప్రభుదాస్‌, నాగేశ్వరరావు, నాగేంధ అక్కమ్మ ,కుమారి, సత్యనారాయణ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.