May 19,2023 23:02

                                                                            జిల్లావ్యాప్తంగా 38వ వర్థంతి సభలు
ప్రజాశక్తి - ఏలూరు

           కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సుందరయ్య వర్థంతిని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి సోమయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె.విజయలక్ష్మి, వి.సాయిబాబు, చింతాడ లక్ష్మి, జె.గోపి, విజెఎం.కృష్ణారావు, ఎం.సత్యం, బి.త్రినాథ్‌ పాల్గొన్నారు.
ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య వర్థంతి సభ నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు విజిఎంవిఆర్‌.కృష్ణారావు, ఆలపాటి నాగేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గుడిపాటి నరసింహారావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఎం.లక్ష్మి, జి.శారద, జగదీష్‌ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక తొమ్మిదో వార్డు అమ్మా చలివేంద్రం వద్ద సుందరయ్య వర్థంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. తొలుత పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి షేక్‌ మాబు సుభాని, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు పసల సూర్యారావు, షేక్‌ సుభాషిణి, వంగా గోపి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.యశ్వంత్‌, డివైఎఫ్‌ఐ నాయకులు ఎం.నాగార్జున, పి.ఏడుకొండలు, చిన్న, పి.యోగి పాల్గొన్నారు.
స్థానిక సిపిఎం కార్యాలయంలో సుందరయ్య వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, పట్టణ నాయకులు పి.సూర్యారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ప్రభాకర్‌రావు, ఆర్‌.దుర్గారావు, పటాన్‌, మస్తాన్‌, పట్టణ కమిటీ సభ్యులు సుభాషిణి, వి.గోపి, మాబుసుభాని, సిహెచ్‌.మాణిక్యాలరావు, బి.యశ్వంత్‌, లెనిన్‌, ఎ.స్టాలిన్‌ పి.సత్తిబాబు, సునీల్‌ పాల్గొన్నారు.
నిడమర్రు : సుందరయ్య ఆశయాలు అందరికీ ఆదర్శమని సిపిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణరావు అన్నారు. సుందరయ్య వర్థంతి సభను నిడమర్రులోని ప్రజాసంఘాల కార్యాలయంలో కోన శ్రీను అధ్యక్షతన జరిగింది. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గవర సత్యనారాయణ, కంచం వరప్రసాద్‌, వెలగలేటి మోహన్‌, బోనాల ప్రసాద్‌, జాన్సీ, రంగారావు, సుదర్శన్‌రావు పాల్గొన్నారు.
కుకునూరు : సుందరయ్య వర్థంతి సందర్భంగా స్థానిక సుందరయ్య ప్రజాసంఘాల భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేందర్రావు, మండల కమిటీ సభ్యులు ఎం.బాబు, వై.సాయికిరణ్‌, వలీ పాషా, కోటా మోహనరావు పాల్గొన్నారు.
చాట్రాయి : సుందరయ్య వర్థంతిని సిపిఎం మండల కార్యదర్శి కొలికిపోగు భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని వెంకటరెడ్డి చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్ద సభ నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు 200 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు టిఎన్‌ఎం.సూరి, కొలికిపోగు మయూత పాల్గొన్నారు.
చిన్నంపేటలో సామాజిక చైతన్య వేదిక మండల కన్వీనర్‌ ఇవి.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో చిన్నంపేట గిన్నెల చెరువు వద్ద ఉపాధి కూలీల సమక్షంలో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కుక్కునూరు : సుందరయ్య వర్థంతి సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని ఐదు పంచాయతీల్లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేందర్రావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుందరయ్య ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని చీరవల్లి, మాధవరం, గొల్లగుప్ప, కొండపల్లి, మారేడుబాక, దాచారం, సీతారామపురం, ఉప్పరమద్దిగట్ల, బుడుగు, నెమలిపేట తదితర పది గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న వెయ్యి మంది కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటా రామలక్ష్మీ, ఎం.బాబు, వై.సాయికిరణ్‌, పట్ల లక్ష్మయ్య, మోహన్‌రావు, వలీపాషా, ఎస్‌.లక్ష్మణరావు, రాము, లక్ష్మీ పాల్గొన్నారు.
వేలేరుపాడు:మండలంలోని గుంపెనగూడెంలో మడకం ఏసు అధ్యక్షతన సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్‌, సిపిఎం నాయకులు మడివి దుర్గారావు, కారం వెంకట్రావు, లక్ష్మణరావు, రాంబాబు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య వర్థంతిని ఆగిరిపల్లి సుందరయ్య నిలయంలో నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్‌.శివ నాగరాజు, సత్తు కోటేశ్వరరావు, గంటా పాపారావు, మువ్వ రాజారావు, జహంగీర్‌ బాషా, జె.గోపాలరావు, ఎం.నరేష్‌, ఎన్‌.ఊళక్కయ్య, బి.కోటేశ్వరరావు, ఎం.సుభాకరరావు, స్టాలిన్‌, పరిశయ్య పాల్గొన్నారు.
కలిదిండి : సుందరయ్య వర్థంతిని మండలంలోని మూలలంక, పోతుమర్రు గ్రామాల్లో సిపిఎం, ప్రజాసంఘాల అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళరావు, ప్రజాసంఘాల నాయకులు చిన్నం శ్రీకాంత్‌, ఎస్‌.మహాలక్ష్మీ, లక్ష్మీతిరుపతమ్మ, కార్యకర్తలు జమ్ము దుర్గ, యజ్జవరపు సావిత్రి, నామాన విష్ణు, బళ్ల మంగమ్మ, పతివాడలంక నాగమణి, కనకమ్మ, సత్యవతి, శిరోమణి పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : సుందరయ్య వర్థంతిని మండలంలో ఉపాధి పని ప్రదేశాలు, ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామ ముత్యాలమ్మ మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి, మండల నాయకులు పోలోజు నాగేశ్వరావు, తెల్లం వెంకటలక్ష్మి, కె.భాస్కర్‌ పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : నూజివీడు పదో వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు, పట్టణ కార్యదర్శి ఎన్‌ఆర్‌.హనుమాన్లు, నాయకులు దుర్గారావు, ప్రభాకర్‌, జిలాని, శ్రీనివాస్‌, రంగారావు, సిఐటియు నాయకులు కమల, ప్రసాద్‌, విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : సుందరయ్య ఆశయాలు ఆదర్శమని సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు అన్నారు. పార్టీ నాయకులు ఆకుల దుర్గారావు అధ్యక్షతన వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్‌, ముళ్లపూడి సురేష్‌, టెక్‌ మధు, దాసం వీర్రాజు, చెరుకూడి మరిడియా, పిల్లా తమ్మారావు, కడియం సీతారాముడు, ధనరాజు, చిలకంటి సత్యనారాయణ, దుర్గారావు, వెంకటేష్‌, సాయి. పి.రమేష్‌, త్రిమూర్తులు, సురేష్‌, గోపి పాల్గొన్నారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
జీలుగుమిల్లి : సుందరయ్య కాలనీలో కాలనీ కమిటీ అధ్వర్యంలో కాలనీ వార్షికోత్సవం, సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌, మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం కుర్చీల పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు ప్రసాద్‌ ద్వారా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు నెలటూరి అప్పారావు, నిర్మల, సిరిబత్తుల సీతారామయ్య, కొండలరావు, దుర్గ, కాలనీవాసులు పాల్గొన్నారు.
టి.నరసాపురం : సుందరయ్య వర్థంతిని మండలంలోని అల్లూరి సీతారామరాజునగర్‌లో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల సత్యనారాయణ, అనుమోలు మురళీ, మడకం కుమారి, బి.కుమారి, చెల్లమ్మ ఉన్నారు.
పోలవరం:సుందరయ్య వర్థంతి సందర్భంగా ఇటుకలకోటలో సిపిఎం నేత బొరగం భూచంద్రం అధ్యక్షతన వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకటరావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పార్టీ మండల కమిటీ సభ్యులు మిడియం గంగాదేవి, టి.బాలరాజు, మిడిమి చలపతి, కొమరం పోసిరత్నం పాల్గొన్నారు.
సుందరయ్య వర్థంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రం
ఏలూరు టౌన్‌ : సుందరయ్య వర్థంతి సందర్భంగా సిపిఎం గాంధీనగర్‌ శాఖ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక పవర్‌పేటలోని సుందరయ్య గ్రంథాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాఖ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సిపిఎం గాంధీనగర్‌ శాఖ కార్యదర్శి కంది విశ్వనాథం అధ్యక్షత వహించారు. సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం తుది శ్వాస వరకూ పోరాడిన నాయకుడు సుందరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాఖ సభ్యులు జనగం గోపి, ఎం.ఇస్సాకు, మాఊరి శ్రీనివాసరావు, చింతాడ వెంకటలక్ష్మి, కంది అమరావతి, జి.శారద, గౌడు రవీంద్ర, అల్లం వెంకటేశ్వరరావు, సువ్వాడ సత్యనారాయణ, బావిశెట్టి సుందరయ్య, కంది వెంకటేశ్వరరావు, సింహాచలం, శేఖర్‌, హరిప్రియ పాల్గొన్నారు.
ముదినేపల్లి : సుందరయ్య వర్థంతిని మండలంలోని దేవపూడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఉల్లంకి నాంచారయ్య, మట్లపూడి కనకరావు, ఆలపాటి కుటుంబరావు, చిన్నం మాధవ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.