Oct 22,2023 18:25

ప్రజాశక్తి - ముసునూరు
   కొర్లకుంట ఎంపిటిసి మృతి చెందడం ముసునూరు మండల వైసిపి రాజకీయాల్లో తీరని లోటని నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేక వెంకట అప్పారావు తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన ఎంపిటిసి, వైసిపి నాయకుడు వన్నుకూటి సుందర రావు(46) గుండెపోటుతో మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవంతో వైసిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, అందరి మన్ననలను పొందిన వ్యక్తి మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.