
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వివిధ పూల మొక్కలు, అందమైన రంగు రంగుల మొక్కలతో పచ్చని లాన్ గడ్డితో సుందరంగా ఉంది. వాటర్ ఫౌంటేన్ జలపాతం ఆకర్షణగా నిలుస్తుంది. మొక్కలతో స్వాగతం పలుకుతూ ఆకర్షణగా ఉంది. ఈ సుందర గార్డెన్‌ను చీఫ్ విప్, ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు శనివారం ప్రారంభించారు. కార్యాలయ సిబ్బంది, కార్యాలయానికి వచ్చేవారికి మానసిక ఆహ్లాదం అందించేలా గార్డెన్‌ను తీర్చిదిద్దినట్లు కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణ, వైస్ చైర్‌పర్సన్ నాగిని, వార్డ్ మెంబెర్స్, కో-ఆప్షన్ మెంబెర్స్ పాల్గొన్నారు.