ప్రజాశక్తి-విజయవాడ: రామవరప్పాడు నుండి ఎయిర్‌పోర్ట్ వరకు సాగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీ లక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఫుట్‌పాత్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాల కనుగుణంగా ఉండాలని శ్రీలక్ష్మీ ఆదేశించారు. రహదారి వెంట గ్రీనరీతో పాటు సుందరీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలనానరు. అనంతరం కష్ణలంక సమీపంలోని రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకరరావు, ఎస్‌ఇ కె.రామమోహన్‌రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ పాల్గొన్నారు.
పార్కులో పనులు వేగవంతం చేయాలి : కమిషనర్
కృష్ణలంక జాతీయ రహదారి పక్కన జరుగుతున్న అంబేద్కర్ పార్కు పునరుద్దరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం అధికారులతో కలిసి కృష్ణలంక జాతీయ రహదారి పక్కన గల అంబేద్కర్ పార్కు పునరుద్దరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పార్కులో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు.










