
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు యడ్ల బజార్ సెంటర్‌లో ఉన్న డంపింగ్ యార్డు త్వరలో సుందరపార్కుగా మారనున్నట్లు వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ చెప్పారు. డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులను డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఉన్న సమస్యకు సిఎం జగన్ కృషితో పరిష్కారం లభించిందన్నారు. రోజు 25 టన్నుల చెత్త గుంటూరుకు చెందిన ఏజెన్సీ ఎరువు, మట్టిగా మారుస్తుందని చెప్పారు. ఇలా మొత్తం 25,180 టన్నుల చెత్త తొలిగిస్తామని చెప్పారు. ఖాళీ అయిన డంపింగ్ యార్డును సుందర పార్క్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికి సంబంధించిన మెటీరియల్‌ను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో పనులు మొదలవుతాయని చెప్పారు. వారితో పాటు వైసిపి నేతలు కోరాడ శ్రీనివాస్, జోగి వెంకటేశ్వరరావు, ఉనికిల శ్రీనివాస్, జోగి వడ్డికాసులు, పాలపర్తి కృపానంద్, కృష్ణాజీ, చెన్ను విజరు, రేలంగి శ్రీను పాల్గొన్నారు.