Sep 28,2023 19:22

ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

ప్రార్థనలు చేస్తున్న దృశ్యం
సుల్తాన్‌ షాహిద్‌ దర్గాలో ప్రత్యేక పూజలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌: మిలాద్‌ ఉన్‌ నబి పర్వదిన సందర్భంగా పట్టణంలోని బిఎస్‌ఆర్‌ సెంటర్‌ లో వెలసి ఉన్న సుల్తాన్‌ షాహిద్‌ దర్గా లో టిడిపి శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడుని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఆయన త్వరగా బయటికి కడిగిన ముత్యంలా రావాలన్నారు. కార్యక్రమంలో తుమ్మల చంద్రా రెడ్డి, సూరా భాస్కర్‌ రెడ్డి , షేక్‌ గౌస్‌ బాషా , చండ్రా వెంకటసుబ్బ నాయుడు , సుంకర పెంచలయ్య చౌదరి , కేత విజయభాస్కర్‌ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, తోడేటి వెంకటయ్య పాల్గొన్నారు.