తాడేపల్లి: 'సులభంగా ఇంగ్లీషు నేర్చుకుందాం' అంటూ మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నిర్వహించనున్న ఉచిత ఇంగ్లీషు శిక్షణా కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రచారం, బ్రోచర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. బాలోత్సవాల రాష్ట్ర కన్వీనర్ పిన్నమనేని మురళీకృష్ణ అధ్యక్షతన శుక్రవారం అమరావతి ఐకాన్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్థానిక బైపాస్‌రోడ్డులోని సిఎస్‌ఆర్ కల్యాణ మండపం సమీపంలోని అమరావతి ఐకాన్ అపార్టు మెంట్లోని హాల్లో ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుత సమాజం ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఇంగ్లీషు భాషపై పట్టు సాధించడంతో పాటు వ్యక్తిత్వ వికాసంపై 8, 9, 10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల కళాశాల విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సింపుల్ ఇంగ్లీష్ తదితర విషయాల మీద బిఎస్‌ఎన్‌ఎల్ అసిస్టెంట్ మేనేజర్ పి.రాజు (ఎంఎప ిహెచ్‌ఐ) శిక్షణ ఇస్తారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి లక్ష్య సాధన నాయకత్వ లక్షణాలు, టీమ్ అభివృద్ధి, ప్లానింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాలపై ప్రొజెక్టర్ స్కీన్‌పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. సమా జానికి ఎంతో సేవ చేయాలని ముందుకు వచ్చిన పి.రాజు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే అపార్టుమెంట్లలో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. తాడేపల్లి పట్టణం, మండలంలోని వేలాది మంది విద్యార్థులు ఉన్న జడ్‌పి హైస్కూల్, అరవింద, పెను మాక జడ్‌పి హైస్కూల్లో బాలోత్సవం నిర్వాహకులు ప్రచా రం నిర్వహించారు. ఆయా పాఠశాలల నుంచి విద్యార్థులు రావడానికి సుముఖంగా ఉన్నారు. మరిన్ని వివరాలకు 8790854540, 9246466115, 9848021115 నెం బర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటి ఎంసి కోశాధికారి గాదె సుబ్బారెడ్డి, కార్యదర్శులు జిఎస్‌ఆర్ మోహనరావు, శ్రీలక్ష్మి, యార్లగడ్డ సుబ్బారావు, నరసింహ, కొట్టె కరుణాకరరావు, నాగరాజు, సురేంద్ర, ఈదర రాజశేఖర్, మోహన్‌బాబు, డి.విజయబాబు పాల్గొన్నారు.










