సులభతరహా బోధన అందించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థులకు ఉపాధ్యాయులు సులభ తరహలో బోధన అందించాలని మండల విద్యాశాఖ అధికారి-1 షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక ఎన్.బి పాఠశాలను ఆయన ఆకస్మియంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొని విద్యార్థులకు విలువైన సందేశాలు చేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నైపుణ్యాలను పరిశీలించి ఆంగ్లంలో విద్యార్థుల సామర్థ్యాలు నైపుణ్యాలు బాగున్నవని ఇంగ్లీష్ రైమ్స్ రాగయుక్తంగా పాడుతున్నారని ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను అభినందించారు. బోధనోపకరణాలను ఉపయోగిస్తూ విద్యార్థులకు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు సులభరీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కప్పా.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










