Feb 24,2023 00:42
శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నిజాంపట్నం: నిజాంపట్నం బస్టాండ్‌ సెంటర్లో ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్‌ కాంప్లెక్స్‌ ను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించుటకు తమ వంతు కషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు మోపిదేవి వెంకట హరినాథ్‌ బాబు అన్నారు. గురువారం నిజాంపట్నం బస్టాండ్‌ సెంటర్లో సులభ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేసి మోపిదేవి సోదరుడు మాట్లాడారు. సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు నిధులను కేటాయించి త్వరితగతిన సమస్య పరిష్కరించారని పేర్కొన్నారు. జడ్పిటిసి నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ నిజాంపట్నం బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సులభ కాంప్లెక్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో వచ్చిన ప్రజలను ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మోపిదేవి వెంకట రమణారావు మండల కేంద్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాజర్‌ ఖాన్‌, బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కన్నా శ్రీనివాసరావు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.