Sep 11,2023 00:02

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
షుగర్‌ వ్యాధిగ్రస్తులు కంటి పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని కంటి వైద్యులు డాక్టర్‌ ఎం సతీష్‌కుమార్‌ సూచించారు. మండలంలోని గంగవరం ఆరోగ్య సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మంచాల వెంకటరామయ్య, రంగమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. క్రమం తప్పకుండా షుగర్‌ పరీక్షలు చేయించుకోవటం వల్ల చూపును కాపాడు కోవచ్చన్నారు. 100 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. శిబిరంలో డాక్టర్‌ మంచాల రమేష్‌ కుమార్‌, డాక్టర్‌ ఎ సాంబయ్య బిపి, షుగర్‌, గుండె పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డాక్టర్‌ వలేటి కాంతారావు, పద్మావతి జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులు శిబిరం నిర్వహణకు సహకరించారు. కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్‌ కె బాలచంద్రం, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య,  సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, కె రామకోటేశ్వరరావు, కె సృజన, జ్యోతి, కమలాకర్‌, వి మోహన్‌రావు, కె జగన్నాధం, బి వేణుగోపాలరావు పాల్గొన్నారు.