Sep 10,2023 23:52

ప్రజాశక్తి - చీరాల
ఆధునిక జీవనంలో పని ఒత్తిళ్ళ నేపథ్యంలో షుగర్ వ్యాధి బారిన పడినవారు అప్రమత్తంగా ఉంటూ ఆహార అలవాట్లను మార్చుకొని జాగ్రత్త వహించాలని డాక్టర్ ఉదరగుడి రాజేష్ అన్నారు. పబ్బి శెట్టి సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ ఆవోప ఆధ్వర్యంలో ప్రతినెల రెండవ ఆదివారంన నిర్వహించే ఉచిత డయాబెటిక్ క్యాంపు విజయవంతం అయ్యింది.  క్యాంపులో సుమారు 80మందికి డాక్టర్ ఊదరగుడి రాజేష్, డాక్టర్ మేడిద దివ్య సుధాకర్ దంపతులు వైద్య పరీక్షలను అందించారు. డయాబెటిస్ పలు వైద్య సమస్యలపై అవగాహన కల్పించారు. మందులు ఉచితంగా పంపిణీ చేశారు.