Oct 31,2023 23:40

ప్రజాశక్తి - చాగల్లు చాగల్లు జైపూర్‌ సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం కన్వీనర్‌ గారపాటి వెంకట సుబ్బారావు కోరారు. ఈ మేరకు హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనితను ఆయన కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ఫ్యాక్టరీకి వచ్చిన నష్టాల కారణంగా మూసివేశారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీపై మూడు జిల్లాల పరిధిలో 15 మండలాలకు చెందిన రైతులు, కార్మికులు, కర్షకులు ఆధారపడి ఉన్నారని వివరించారు. గతంలో రైతులు, కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు.