ప్రజాశక్తి-ఘంటసాల : టీడీపీ కార్యకర్తలు గుండె ధైర్యంతో పోరాడాలని ఇంకెవరూ గుండెపోటుకు గురి కాకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లిలో టీడీపీ కార్యకర్త కొడాలి సుధాకరరావు భౌతిక కాయాన్ని బుద్ధప్రసాద్ సందర్శించి నివాళులు అర్పించారు. చంద్రబాబు అరెస్టు వార్త టీవీలో చూసి సుధాకరరావు గుండెపోటుతో మృతి చెందారు. సుధాకరరావు కుటుంబానికి రూ.25వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీకి పోయే కాలం రాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారనీ, పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారన్నారు. తెలుగు జాతి మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలవాలన్నారు. తెలుగు ప్రజలు గుండె ధైర్యంతో ఈ దుష్ట ప్రభుత్వం సాగనంపేందుకు పోరాడాలన్నారు. బుద్ధ ప్రసాద్ వెంట టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, పరుచూరి సుభాష్ చంద్రబోస్, గొర్రెపాటి వెంకట రామకష్ణ, అయినపూడి భానుప్రకాష్, పరిసే చలపతి, దిరిశం వెంకట్రావు, యార్లగడ్డ వీరభద్రరావు, దండమూడి శివ నాగేశ్వరరావు, సూరపనేని శివరాం ప్రసాద్, కొడాలి లక్ష్మణ రావు, మొవ్వ కోటేశ్వరరావు, దోనేపూడి శ్రీనివాసరావు, దిరిశం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.










