ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
మండలంలోని సూదివారిపాలెంలో రోటరీ ఆధ్వర్యంలో 521వ నేత్రదానం జరిగింది. గ్రామానికి చెందిన గొర్రె ముచ్చు సాంబశివరావు మృతి చెందగా కుటుంబ సభ్యులు రోటరీ అవయవదాన కమిటికి సమాచారం అందించారు. దీంతో గుంటూరు శంకర్ కంటి వైద్యశాల వైద్యులు సూదివారిపాలెం వచ్చి కార్నియాలను సేకరించినారు. నేత్రదానం చేసినందుకు దాత భార్య కేరోబోలు, కుమార్తె శ్రీలేఖ, శ్రీవిద్య, నాగేశ్వరరావులను రోటరీ అవయవ దాన కమిటీ సభ్యులు సోమేపల్లి రామ్మోహన్‌రావు, జెట్టి స్వామి, రోటరీ క్లబ్ అధ్యక్షులు కరి కమలేశ్వరరావు, ట్రెజరర్ సాంబశివరావులను అభినందించారు.










