Sep 22,2023 01:09

ప్రజాశక్తి - పర్చూరు
స్థానిక కోర్టులో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తూ పదోన్నతిపై బదిలీ అయిన ఎం సుభవాణిని న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొల్లా నరేంద్రకుమార్‌ అధ్యక్షతన సత్కార సభ నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలలోనే పదోన్నతి పొంది ప్రకాశం జిల్లా మార్కాపురం 6వ అదనపు జిల్లా జడ్జిగా నియమితులు కావటం అభినందనీయమని కొనియాడారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి పి శాంతి, న్యాయవాదులు రావి సత్యనారాయణ, చాగంటి సుబ్బారావు, పోతిన సురేంద్ర, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రావి రమేష్‌, వెంగలశెట్టి తిరుమలరావు, ఓ గోవిందరాజు పాల్గొన్నారు.