Sep 03,2023 23:33

ప్రజాశక్తి - అద్దంకి
మండలంలోని బొమ్మనంపాడులో కామేపల్లి రమేష్ బాబు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె వివాహానికి ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ హాజరై వధూవరులు తేజస్విని, చైతన్యను ఆశీర్వదించారు. గోపాలపురంలో మల్లిపెద్ది శ్రీనివాసరావు, రామాంజమ్మ దంపతుల కుమారుని వివాహం ఈనెల 1న జరుగగా ఆదివారం సత్యనారాయణ స్వామివ్రతంకు హాజరయ్యారు. నవ దంపతులు రాజేష్, జాహ్నవిలకు ఆశీస్సులు తెలిపారు. కోటిస్వాములు స్థానిక బొడ్డురాయి వద్ద మొక్కు చెల్లింపుకు హాజరయ్యారు. శ్రీనివాసరావు, లక్ష్మీనరసమ్మ దంపతుల కుమారుని వివాహంకు హాజరై వరుడు వెంకటేష్‌కు ఆశీస్సులు తెలిపారు. అద్దంకి పట్టణంలో మెల్లెంపూడి శ్రీకుమార్, శ్యామలాదేవి దంపతుల కుమారుని వివాహం ఒంగోలు ఏ1 ఫంక్షన్ హాల్‌లో జరుగగా హాజరై నూతన వధూవరులు కృష్ణతేజ, హారికను ఆశీర్వదించారు.