
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం రూరల్ మండలం కగ్గల్లు పంచాయతీ పరిధిలోని సుబ్బిరెడ్డి పల్లిలో అతిసార ప్రబలింది. గ్రామంలో ఒక్క సారిగా కొంత మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో గ్రామానికి చెందిన 15 మంది తీవ్ర అస్వస్థతకు గురై హిందూపురం జిల్లా అసుత్రికిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ అసుపత్రిలో గ్రామానికి చెందిన క్రిష్టప్ప, సంజీవప్ప, ఓబులమ్మ, ఆశ:్వర్థప్ప, చిన్న సంజీవప్ప, తిప్పన్న, సాకమ్మ, చంద్రిక, లక్ష్మిదేవమ్మ, నూర్జహాన్ తదితరులు చికిత్స పొందుతున్నారు. ఈసందర్భ:గా వారు మాట్లాడుతు తమ గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయన్నారు. తమకు నీటి సరఫరా చేయడానికి ఓవర్ హెడ్ ట్యాంకు ఉందని తరచు ఆ ట్యాంక్‌లో కాకులు ఇతర పక్షులు పడుతుంటాయాని, దీంతోనే తమకు వాంతులు, విరేచనాలు అయ్యాయని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఎంపిడిఒ నరేంద్ర కుమార్‌తో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. అనంతరం ప్రతి ఇంటికి ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించి వేడి నీటిలో కలుపుకుని తాగాలని సూచించారు. ఈ సందర్బంగా ఎంపిడిఒ నరేంద్ర కుమార్ మాట్లాడుతు వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రతి ఇంటిని సర్వే చేయించి, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నీళ్ల ట్యాంక్‌తో పాటు పారిశుధ్యాన్ని మెరుగు పర్చామన్నారు.