ప్రజాశక్తి- యు.కొత్తపల్లి
సెజ్ పోరాట నాయకుడు పెనుమల్లు సుబ్బిరెడ్డి మృతి తీరని లోటు అని, రైతు ఉద్యమ నాయకుడని కోల్పోయామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారా యణ అన్నారు. సోమవారం సుబ్బిరెడ్డి సంస్మరణ సభ రమణక్కపేటలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, పేదల భూములను బలవం తంగా లాక్కుంటున్నాయన్నారు. పోరాడితే అక్రమ కేసులు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ఎదిరించి పోరాడిన నాయకుడు పెనుమల్లు సుబ్బిరెడ్డి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో 24 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం గుంజు కుంటుందని చెప్పారు. సెజ్ ప్రాంతంలో 2,500 ఎకరాల భూమి తిరిగి రైతులకు ఇచ్చారంటే అది సుబ్బిరెడ్డి పోరాట ఫలితమేనని ఆయన అన్నారు. ఇంకా అనేకమంది భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదన్నారు. ఎకరాకు రూ.10లక్షలు కూడా ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం దగా చేసిందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సెజ్ రైతులందరికీ 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలన్నారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ రైతులు మరింత సంఘటితమై పోరాడాలన్నారు. ఈ సభలో మహిళా సంఘం నాయకులు సిహెచ్.రమణి, కౌలు రైతు సంఘం నాయకులు ఎం.రాజశేఖర్, సుబ్బి రెడ్డి గారితో పాటు పోరాటంలో పాల్గొన్న పి.నరసింహారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె.నాగే శ్వరరావు, జి.వెంకటసుబ్బారెడ్డి, సిహెచ్.నారాయణ రెడ్డి, సిహెచ్.సాంబశివకుమార్, కె.చిన్న, కె.రాజు, కె.విశ్వ నాథం, సుబ్బిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










