సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేస్తున్న జగ్గునాయుడు
ప్రజాశక్తి -గాజువాక : సిపిఎం సీనియర్ నాయకులు జి.సుబ్బారావు సేవలు ఎనలేనివని వక్తలు కొనియాడారు. జివిఎంసి 25వ వార్డు పరిధి బానోజీతోటలో ఆర్.నాగేశ్వరరావు ఆధ్వర్యాన సుబ్బారావు సంతాపసభ నిర్వహించారు. సుబ్బారావు చిత్రపటానికి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఎన్.రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సుబ్బారావు ఆశయాల దిట్ట అన్నారు. ఆయన మార్గంలో పయనించడమే కార్మికరాజ్యానికి సరైన మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో టి.శ్రీనివాసరావు, ఎం.నాగేశ్వరరావు, బి.శ్రీనివాస్, ఎం.జ్యోతి, శ్యామ్, మీనాక్షి, నాగరాజు, వార్డులోని అభిమానులు పాల్గొన్నారు.










