Apr 03,2023 23:28

సుబ్బారావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కృష్ణమూర్తి

ప్రజాశక్తి -గాజువాక : సిపిఎం సీనియర్‌ నాయకులు జి.సుబ్బారావు మృతిచెందడంతో షీలానగర్‌లోని ఆయన కుటుంబాన్ని సిపిఎం విజయనగరం జిల్లా పూర్వ కార్యదర్శి బి.కృష్ణమూర్తి సోమవారం పరామర్శించారు. సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతం కోసం సుబ్బారావు చివరి వరకు పోరాడారన్నారు. నిత్యం ప్రజల కోసం పాటుపడ్డారని తెలిపారు. పరామర్శించిన వారిలో కృష్ణమూర్తి సతీమణి కుమారి, వార్వా నాయకులు దాసరి అప్పారావు, గణేష్‌ ఉన్నారు.