Sep 06,2023 20:04

జాతాలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-ఉలవపాడు :ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ, విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు తీరడం లేదని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి. రమణ విమర్శించారు. జిల్లాలో విద్యారంగ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 5 నుంచి 10 వరకు జరుగుతున్న జీపు జాతా బుధవారం ఉలవపాడు మండల కేంద్రానికి చేరింది. ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక స్కూల్‌ వద్ద విద్యార్థులు స్వాగతం పలికారు. హై స్కూల్‌ వద్ద నుంచి బస్టాండ్‌ వరకు ప్రదర్శన జరిగింది. జాతాలో పాల్గొన్న జిల్లా నాయకులు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. జాతాను ఉద్ధేశించి డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ప్రకాశం జిల్లా కార్యదర్శి జివిబి కుమార్‌ మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం, 'మీ రాతలు మారుస్తాం అని ప్రకటనలు చేశారని,ఆచరణలో విస్మరించారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నోటిఫికేషన్లు జారీ చేయలేదన్నారు. రామాయపట్నం పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆచరణలో తమ అనుయాయులకు కట్టబెడుతుందని, ఫలితంగా నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పిలుపునిచ్చారు. బాలుర ఎస్‌సి హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు తమకు కాస్మోటిక్స్‌, మెస్‌ ఛార్జీలు పెంచాలని వినతిపత్రం అందజేశారు. జాతాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిపి.శ్రీను వాసులు, జిల్లా నాయకులు వి నరేంద్ర బి.బాలాజీ, ఎన్‌.సుమంత్‌, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బి.పి నరసింహ, జిల్లా నాయకులు వంకదారి శ్రీనివాసులు,పి. నరసింహ,గోను.చైతన్య, ఎస్‌ఎఫ్‌ఐ ఉలవపాడు మండల కార్యదర్శి సంకూరి అజరు, మండల నాయకులు చింతల సుమంత్‌ ధారా.శివ ఉన్నారు.