Jul 18,2023 21:17

స్థానికుల ఫిర్యాదుతో పూడికతీత

స్థానికుల ఫిర్యాదుతో పూడికతీత
ఉంగుటూరు: బాదంపూడిలోని జడ్‌పి ఉన్నత పాఠశాల వెనుక వైపు మురుగు కాలువలోకి స్థానిక కోళ్ల పరిశ్రమ నుంచి వ్యర్థాలు కలసి దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదు చేశారు. ఈమేరకు నివారణ చర్యలు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి బైర్రాజు నరసింహరాజు మంగళవారం పేర్కొన్నారు. మంగళవారం జెసిబి సాయంతో మురుగు కాలువలో వ్యర్థాలు, పూడికలను తొలగించి, పారిశుధ్య పనులను నిర్వహించామని కార్యదర్శి తెలిపారు. సంబంధింత కోళ్ల పరిశ్రమ నిర్వాహకులకు నోటీసు ఇచ్చామన్నారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా, పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామన్నారు.